కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ. భూపాలపల్లిలో ఆయుష్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం 16 నర్సింగ్ కాలేజీలు తీసుకొచ్చిందన్నారు. 108 ,104 అంబులెన్స్ లను తీసుకువచ్చిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. తమ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 5 లక్ష్యల నుంచి 10 లక్షలకు పెంచిందన్నారు.
ALSO READ | జనగామలో త్వరలో అందుబాటులోకి సిటీ స్కాన్ సేవలు
పేదరికం ఉంటే ఆ పేదవానికి ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. భూపాలపల్లికి ఇంకా 50 మంది ఏఎన్ఎంలు కావాలన్నారు. సింగరేణి కార్మికులను కాపాడుకొనే బాధ్యత తమదేనన్నారు. డైట్ చార్జీలను 40 శాతం పెంచామన్నారు దామోదర రాజనర్సింహా. విద్య ,వైద్యం, సంక్షేమం, మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో కుటుంబ పాలన చూశాం.. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజాపాలన చూస్తున్నారని తెలిపారు.