Rain alert: ఏపీకి దానా తుఫాన్​ ముప్పు.. మూడు రోజుల పాటు భారీవర్షాలు..

Rain alert: ఏపీకి దానా తుఫాన్​ ముప్పు.. మూడు రోజుల పాటు భారీవర్షాలు..

ఆంధ్రప్రదేశ్​అతలాకుతలం అవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది.  ఈ వాయుగండం ​ 25 వతేదీ నాటికి తుఫాన్ గా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈ తుఫానుకు దానా తుఫానుగా పేరు పెట్టారు,  పారాదీప్‌కు 730కి.మీ, బెంగాల్ ఐలాండ్‌కు 770కి.మీ, బంగ్లాదేశ్ కేపు పారాకు 740కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. దానా ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తాయి.  ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు  (23,24,25) ఉత్తర  కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. తుఫాను తీరందాటే సమయంలో గంటకు 100-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. . అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.    ఈ వాయుగుండం ఏపీ నుంచి పశ్చిమ బెంగాల్ మధ్య ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 దానా తుపాను కారణంగా రోడ్లు జలమయమవ్వడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడం, కొండచరియలు విరిగే ప్రమాదం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరీకలు జారీ చేసింది.ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందని విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Also Read :- కుక్క వెంట పడితే.. థర్డ్ ఫోర్ నుంచి దూకి చనిపోయాడు

అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.   శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.