హైదరాబాద్, వెలుగు: గ్రేటర్పరిధిలో దోమల నివారణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని మున్సిపల్ప్రిన్సిపల్సెక్రటరీ దాన కిశోర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎన్ బీటీనగర్, మినిస్టర్స్ క్వార్టర్స్, మిథిలానగర్, రేషంబాగ్ లో చేపట్టిన ఫాగింగ్ను జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రెగ్యులర్గా సాయంత్రం వేళల్లో ఫాగింగ్ చేపట్టాలన్నారు. అవసరమైన చోట హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. చెరువుల్లో గుర్రపు డెక్క ఉండొద్దని ఆదేశించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్ ముమ్మరంగా చేపట్టాలన్నారు.