ఏప్రిల్ 30లోగా ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లను పరిష్కరించాలి : దాన కిషోర్

ఏప్రిల్  30లోగా ఎల్ఆర్ఎస్​ అప్లికేషన్లను పరిష్కరించాలి : దాన కిషోర్
  • కలెక్టర్లు, మున్సిపల్ ​కమిషనర్లకు దాన కిషోర్ ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు:  లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తులను ఈ నెల 30లోగా 100 శాతం పరిష్కరించాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ ఆదేశించారు. గురువారం ఆయన సెక్రటేరియెట్ నుంచి డీటీసీపీ డైరెక్టర్ దేవేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో తక్కువ ప్రొసీడింగ్‌లు జారీ చేసిన కలెక్టర్లతో దాన కిషోర్ మాట్లాడారు.

 ఫీజు చెల్లించిన దరఖాస్తుదారులందరికీ వేగంగా ప్రొసీడింగ్‌లు జనరేట్ చేయాలని ఆదేశించారు. ఓపెన్ ప్లాట్‌లతో పాటు లే అవుట్‌ల వెరిఫికేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బల్క్ అప్లికేషన్‌ల పరిష్కారంపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్  ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడానికి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.