కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: నిర్దిష్ట గడువులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ అన్నారు. సోమవారం ఆయన సీడీఎంఏ వీపీ గౌతమ్‌తో కలిసి హైదరాబాద్ నుంచి అడిషనల్కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్, స్వయం సహాయక మహిళా బృందాల బ్యాంక్ లింకేజీలో పురోగతి, మహిళ శక్తి క్యాంటీన్లు, స్వచ్ఛదనం–పచ్చదనం, వీధి కుక్కల వల్ల ముప్పు తదితర అంశాలపై సమీక్షించారు.
అనంతరం బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఏబీసీ కేంద్రం అందుబాటులో ఉందని ఇక్కడ ప్రతి నిత్యం 25-30 వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయడంతోపాటు వారంలోగా 5 క్యాంటీన్ లు ప్రారంభించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ.47 కోట్ల రుణం అందించామన్నారు. కార్యక్రమంలో సీపీ రవీంద్ర, సీఎంహెచ్ వో రాజేష్, హెచ్ వో రమేశ్, టీపీఆర్ వో కోలా రాజేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.