గ్రేటర్​లో నీటి ఎద్దడి నివారణకు  ప్లాన్​ రెడీ చేయాలి : దాన కిశోర్​

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: గ్రేటర్​ సిటీలో నీటి ఎద్దడి లేకుండా సమగ్ర ప్రణాళికలతో సిద్ధంగా  ఉండాలని ఎంఎయూడీ ప్రిన్సిపల్​ సెక్రటరీ దాన కిశోర్​ అధికారులకు సూచించారు.  సోమవారం  మున్సిపల్​ కమిషనర్​,  ఇంజనీరింగ్​ ఆఫీసర్లతో  నీటి సరఫరా పై సమ్మర్​ యాక్షన్​ ప్లాన్​లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్​  నిర్వహించారు. మున్సిపల్​లో వేసవి సమస్యలు రాకుండా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్​ఈలు కృష్ణ రావు, ప్రవీణ్ చంద్ర, ఈఈలు రాజయ్య, బీఎల్​ శ్రీనివాస రావు, సంజయ్​ కుమార్​, శ్రీనివాస్​, డిఈలు రవీకుమార్​ ఉన్నారు. 

ధర్మసాగర్​  రిజర్వాయర్​- ఫిల్టర్​ బెడ్​  పరిశీలన...

గ్రేటర్​ వరంగల్​లో నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సోమవారం బల్దియా కమిషనర్​ అశ్విని తానాజీ వాకడే అన్నారు. ఇంజనీరింగ్​ ఆఫీసర్లతో కలిసి ధర్మసాగర్​ ఫిల్టర్​ బెడ్​ను  పరిశీలించారు.  బల్దియాలో  మూడు ఫిల్టర్​ బెడ్ల  ల్యాబ్​లో  క్లోరినేషన్​ వివరాలను తెలుసుకున్నారు.