![రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు ఆ ట్రైన్ క్యాన్సిల్](https://static.v6velugu.com/uploads/2025/02/danapur-express-canceled-for-two-days_hlPmaoMsGL.jpg)
హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అప్డేట్ ఇచ్చింది. ట్రాక్ మెయింటెనెన్స్ కారణంగా రెండు రోజుల పాటు దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం (ఫిబ్రవరి 18) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 19న సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లునున్న దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12791)ను రద్దు చేసినట్లు తెలిపింది.
అలాగే.. ఫిబ్రవరి 21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్ రావాల్సిన దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12792)ను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. ట్రాక్ మెయింటెనెన్స్, నిర్వహణ పనులు పూర్తి అయిన వెంటనే తిరిగి యథావిధిగా రైలు సర్వీసును పునరుద్ధరిస్తామని తెలిపింది.