కారు ప్రమాదంలో ప్రముఖ డ్యాన్సర్ మృతి..

కారు ప్రమాదంలో ప్రముఖ డ్యాన్సర్ మృతి..

కర్ణాటకలోని మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నృత్యకారిణి,  రియాలిటీ షో స్టార్ అలీషా (35) మృతి చెందింది. అలీషా శుక్రవారం  బెంగళూరులోని ఓ డ్యాన్స్ షోలో ప్రదర్శన ఇవ్వడానికి వెళుతుండగా మైసూర్‌ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. 

ప్రమాదం జరిగిన సమయంలో ఆలీషాతోపాటూ కారులో ఆమె భర్త జోబిన్ కూడా ఉన్నాడు. కానీ జోబిన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు భాదితులని దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించే క్రమంలో మార్గ మధ్యలోనే అలీషా మృత్ చెందినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం జోబిన్ కేరళలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకుంటున్నాడు.

అయితే అలీషా కి ABCD అనే డ్యాన్స్ స్కూల్ కూడా ఉంది. అంతేకాకుండా పలు రియాలిటీ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చింది. కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఇలా చిన్న వయసులోనే కన్నుమూయడంతో అలీషా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.