కొరియోగ్రాఫర్ జానీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అక్టోబర్ 6 నుంచి 10వ తేదీ వరకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. మళ్లీ ఆయన 11వ తేదీ కోర్టులో లొంగిపోవాల్సి ఉంటుంది. జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం, బెదిరింపుల కేసులో అరెస్ట్ అయిన జానీకి.. మధ్యంతర బెయిల్ ఇవ్వటం వెనక కారణం ఇదే..
జానీకి కొరియోగ్రాఫర్ కేటగిరీ కింద జాతీయ అవార్డ్ ప్రకటించింది కేంద్రం. ఈ అవార్డ్ అందుకోవటం కోసం జానీకి అవకాశం కల్పిస్తూ.. కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సినిమా ఇండస్ట్రీలో.. జాతీయ స్థాయిలో బెస్ట్ కొరియోగ్రాఫర్ వచ్చింది జానీకి. ఈ అవార్డ్ అందుకునేలోపు ఆయనపై అత్యాచారం, వేధింపుల కేసు నమోదు కావటం.. గోవాలో పోలీసులు అరెస్ట్ చేయటం జరిగిపోయింది.
Also Read :- రాజకీయ నాయకులు ప్రజల దృష్టి ఆకర్షించడానికి ‘మా’ పేర్లు వాడకండి
జాతీయ అవార్డ్ ను స్వయంగా అందుకోవటం కోసం జానీ పెట్టుకున్న పిటీషన్ పై విచారణ చేసిన రంగారెడ్డి జిల్లా కోర్టు.. అక్టోబర్ 10వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.