
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ డ్యాన్స్ అసోసియేషన్ లో జరిగిన ఎన్నికలపై స్పందించాడు. ఇందులోభాగంగా తన అధికారిక సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో తనని పర్మినెంట్ గా డ్యాన్స్ యూనియన్ నుంచి తొలగించినట్లు వినిపిస్తున్న వార్తలలో నిజంలేదని క్లారిటీ ఇచ్చాడు.
అలాగే తన పదవీకాలం ఇంకా ఉన్నప్పటికి అనధికారంగా కొందరు ఎలక్షన్లు నిర్వహించి వారంతటవారే పదవులు చేపట్టే అధికారం లేదని అన్నాడు. ఈ విషయంపై లీగల్ గా ఫైట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నాడు. అలాగే ఈ కష్టకాలంలో తనకి అండగా నిలిచి సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు తెలిపాడు.
ఇక కొందరు నిజానిజాలు తెలుసుకోకుండా ఎదుటివారి మనసులు గాయపరిచేలా వార్తలు ప్రచారం చేశారని దాంతో తన మనసు కూడా ఎంతగానో బాధ పడిందని ఎమోషనల్ అయ్యాడు. అలాగే టాలెంట్ ఉన్నవారిని ఎవరూ కూడా పనిలోంచి తీయ్యలేరని, ఆపలేరని త్వరలోనే మంచి సాంగ్ తో మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చాడు.
ALSO READ | Pushpa 2 : పుష్ప యూనిట్ కు రాజస్తానీయుల వార్నింగ్ : షెకావత్ సీన్లు తీసేయాలంటూ అల్టిమేటం
ముక్కురాజు మాస్టర్ పెట్టిన టీఎఫ్ టీడీ స్థాపించిన డ్యాన్స్ యూనియన్ ద్వారానే తనకి డాన్సర్ గా మంచి పేరొచ్చిందని దాంతో అందులోనే కొనసాగుతానని తనని తీసేసే హక్కు ఎవరికీ లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తన సాంగ్ కి సంబందించిన రిహార్సల్స్ జరుగుతున్నాయని, తన అసిస్టెంట్స్ కూడా పని చేస్తున్నారని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ ప్రముఖ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాకి కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాలోని తాను పని చేసిన సాంగ్ రిలీజ్ ఉంటుందని తెలిపాడు.
నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!!
— Jani Master (@AlwaysJani) December 9, 2024
నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి… pic.twitter.com/qroJxE5Uxv