డ్యాన్స్ లవర్స్‌ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్–1కు కొనసాగింపుగా ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్–2’ ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా షో వివరాలు తెలియజేసేందుకు శనివారం టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఓంకార్ మాట్లాడుతూ ‘ఫస్ట్ సీజన్ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు.
ఇప్పుడు వైల్డ్ ఫైర్‌తో సీజన్–2గా రాబోతున్నాం. ఫరియా అబ్దుల్లా హోస్ట్‌గా చేస్తుండటం హ్యాపీగా ఉంది. శేఖర్ మాస్టర్ సెకండ్ టైమ్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. డ్యాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్.. ఇలా ఆడియెన్స్‌కు కావాల్సిన ప్రతి ఎలిమెంట్ మా షోలో ఉంటుంది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్స్ సర్‌ప్రైజ్ చేస్తారు.
ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది’ అని చెప్పాడు. ఓంకార్, శేఖర్ మాస్టర్‌తో కలిసి హోస్ట్ చేస్తుండటం ఆనందంగా ఉందని, ప్రతి ఎపిసోడ్ అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది అని ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఫస్ట్ సీజన్‌లానే రెండో సీజన్ కూడా ప్రేక్షకులను అలరిస్తుందని శేఖర్ మాస్టర్ అన్నాడు. మెంటార్స్ యష్, మానస్, ప్రకృతి, సింగర్ జాను లైరి ఈ
కార్యక్రమంలో పాల్గొన్నారు.