కోకో అమ్మవారికి ప్రత్యేక పూజలు

దండేపల్లి,వెలుగు:  గిరిజనుల ఆరాధ్య దైవమైన పద్మల్ పురి కాకో ఆలయంలో దండారీ ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.  మండలంలోని గుడి రేవు  గోదావరి ఒడ్డున గల  పద్మల్ పూరీ కాకో ఆలయంలో శుక్రవారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఏపీ  రాష్ట్రాల నుంచి వేలాది మంది గిరిజనులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. 

గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం గంగాజలంతో  అమ్మవారికి అభిషేకం చేసి  పూజలు చేశారు.