దండేపల్లి ఎస్ఐ సస్పెన్షన్

  •     బదిలీపై వచ్చిన వారం రోజుల్లోనే వేటు
     

దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి ఎస్ఐ కల్యాణపు నరేశ్ ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఐ నరేశ్ వారంరోజుల క్రితమే జిల్లాలోని కన్నెపల్లి నుంచి దండేపల్లికి బదిలీపై వచ్చారు. కన్నెపల్లిలో బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కోగా.. గత కమిషనర్ రెమా రాజేశ్వరి విచారణ చేపట్టి చర్యలు తీసుకునే సమయంలోనే ఆమెకు ట్రాన్స్​ఫర్​అయ్యింది. బదిలీపై వచ్చిన కమిషనర్ శ్రీనివాసులు పాత ఫైల్ తీసి అవినీతి ఆరోపణలు ఎదురుకొంటున్న నరేశ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.