వెలుగు, లైఫ్ స్టైల్: ప్యాకెట్ ఫుడ్స్ తో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే, బర్మింగ్ హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజాగా మరో విషయం వెల్లడించారు. ప్యాకెట్ల లైనింగ్ లో ఉండే జింక్ ఆక్సైడ్ ఎక్కువ స్థాయిలో ఆహారంలోకి చేరుకోవడం వల్ల పేగుల్లో కణాలు సరిగా పని చేయవు. ఫలితంగా పోషకాలు శరీరానికి చేరకుండానే వ్యర్థాలుగా బయటికి వెళ్లిపోతాయి.
బ్యాక్టీరియా ద్వారా ఆహారం పాడవకుండా ఉండేందుకు జింక్ ఆక్సైడ్ ఉపయోగపడుతుంది. వీటివల్ల పెద్దగా సమస్యలు లేవని ఇప్పటి వరకు అనుకున్నారు. అయితే, తాజా పరిశోధన ద్వారా పరోక్షంగానైనా కొన్ని సమస్యలు ఉన్నట్టు తెలిసింది.
ALSO READ : Good Food : క్యాబేజీ తింటే కొన్ని క్యాన్సర్లు రావు.. శెనగలు తింటే బోలెడు విటమిన్లు వస్తాయి..!
'చిన్నపేగుల మోడల్ తో కొన్ని ప్రయోగాలు చేశాం. ఎంత మోతాదులో నానో కణాలు ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం’’ అని పరిశోధకులు తెలిపారు. 'జింక్ ఆక్సైడ్ నానో కణాల పైకి చేరి ప్రత్యేక భాగాలకు అతుక్కుంటాయి. ఫలితంగా సమస్యలు వస్తాయి.' అని తాము ప్రయోగాల ద్వారా తెలుసుకున్నామని శాస్త్రవేత్త మాహర్ చెబుతున్నారు.
--V6 వెలుగు లైఫ్