ఓటీటీలు ఎంత డేంజర్ గా మారాయంటే.. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ఓటీటీ నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. క్రైమ్ ఎలా చేయాలో.. ఎలా తప్పించుకోవాలో చాలా సింపుల్ గా తెలుసుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ తో రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఓటీటీలలో చూసిన స్టంట్స్, క్రైమ్ ప్లాన్స్ రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి డేంజర్ లో పడుతున్నారు. ఓటీటీకి
సెన్సార్ కటింగ్స్ లేకపోవడంతో ఇందులోని కంటెంట్ అత్యంత దారుణంగా ఉంటున్న ది. రొమాంటిక్ మూవీస్ పేరుతో బోల్డ్, సెమీ న్యూడ్ సీన్స్ పెరిగిపోయాయి. డైలాగుల్లో మాటకో బూతు కామన్ గా మారింది. ఇంట్లో పిల్లలతో కలిసి చూస్తున్న ప్పుడు అప్పటిదాకా సాఫీగా సాగే మూవీ వెబ్సరీస్లో అకస్మాత్తుగా వస్తున్న బూతు డైలాగులు, లిపు లిప్ కిస్లు, బెడ్రూం సీన్స్ చూసి తల్లిదండ్రులు బిత్తరపో తున్నారు. ఇక హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల్లో క్రైమ్ : సన్నివేశాలు మరీ శ్రుతిమించుతున్నాయి. అత్యంత కిరాతకంగా హత్యలు చేయడం, కేసుల నుంచి తప్పిం 1 చుకునేందుకు శవాలను ముక్కలు చేయడం, కుక్కల కు వేయడం, కుక్కర్లో వేసి ఉడికించడం, కాల్చి పొ డిచేయడం, డ్రైన్లు, చెరువుల్లో కలపడం లాంటి సీన్స్ ఉంటున్నాయి.
ఓటీటీ వెరీ డేంజర్.. రీసెంట్ స్టడీ
ఓటీటీల ప్రభావంపై 2017 నుంచి 2024 మధ్య కాలంలో వచ్చిన 25 స్టడీలను సమగ్ర అధ్యయనం చేసి 2024 మార్చి 31న ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ' ఓ రిపోర్ట్లు రిలీజ్ చేసింది. ఓటీటీ కంటెంట్ కారణంగా సమాజంలో నేరాలు, లైంగిక హింస పెరుగుతున్నాయని అందులో అభిప్రాయపడింది.
ఓటీటీకి అలవాటు పడ్డవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కలుగుతున్నట్టు.. ముఖ్యంగా టీనేజర్స్లో లో ఒంటరితనం, హింసాప్రవృత్తి పెరుగుతున్నట్టు, గుంపులుగా ఉన్నప్పుడు క్రూరంగా ప్రవరిస్తున్నట్టు ఈ స్టడీ తేల్చింది. ఓటీటీకి కేటాయించే సమయాన్ని క్రమంగా తగ్గిస్తూ సాహిత్యం, సంగీతం, ఇతర కళలు, అభిరుచుల వైపు దృష్టి సారిస్తేనే ఈ విపత్తును బయటపడవచ్చని సూచించింది.