న్యూఢిల్లీ: ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ తో ప్రతి ఏటా15 లక్షల మంది మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో 2009 నుంచి 2019 మధ్య ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇందుకోసం గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 (పీఎమ్ 2.5) కాలుష్య కారకాల కారణంగా ఏటా నమోదైన మరణాలను ప్రామాణికంగా తీసుకున్నారు. హర్యానాలోని అశోక యూనివర్సిటీ, ఢిల్లీలోని సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్ రీసెర్చర్స్ ఈ అధ్యయనం చేశారు. దీనిని ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు.
ఇండియాలో110 కోట్ల మంది ప్రజలు (దాదాపు 82 శాతం) వాయు కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని ఈ స్టడీలో తేలింది. ఈ అధ్యయనం కోసం శాటిలైట్లు, 1000 గ్రౌండ్ మానిటరింగ్ స్టేషన్ల నుంచి డేటాను సేకరించారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నుంచీ మృతుల వివరాలను తీసుకున్నారు.