ORRపై దూసుకుపోయిన కార్లు.. రయ్ రయ్​ మంటూ కార్లతో స్టంట్స్​

ORRపై  దూసుకుపోయిన కార్లు.. రయ్ రయ్​ మంటూ కార్లతో స్టంట్స్​

హైదరాబాద్​ ఓఆర్​ఆర్​ పై కొంతమంది  యువకులు కార్లతో హల్​ చల్​ చేశారు.  ఫిబ్రవరి  9 వ తేది తెల్లవారుజామున కార్ రేసింగ్​ .. స్టంట్స్​  చేస్తూ విన్యాసాలు చేశారు.  ఈ రేసింగ్​ లో రయ్​ రయ్​ మంటూ కార్లు దూసుకుపోయాయి. రోడ్డు మధ్యలో లగ్జరీ కార్లను వేగంగా డ్రైవ్​ చేశారు. సీసీటీవీలో  కార్ల రేసింగ్​ స్టంట్స్​ కు సంబంధించి వీడియో రికార్డ్​ అయింది.  సీసీ ఫుటేజిని పరిశీలించిన పోలీసులు రేసింగ్​లో పాల్గొన్న యువకుల కోసం గాలిస్తున్నారు.