- ఆల్ రిచ్ డెయిరీలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
- 280 కిలోల కల్తీ నెయ్యి గుర్తింపు
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పసుమాములలోని ఆల్ రిచ్ డెయిరీలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం తనిఖీలు చేశారు. పాలు, పెరుగు, నెయ్యి నాణ్యతను పరిశీలించారు. వీటిలో ప్లేవర్డ్ మిల్క్ తో పాటు హానికరమైన రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు. కోల్డ్ స్టోరేజ్ పైకప్పు తుప్పు పట్టి అపరిశుభ్రంగా ఉండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కంపెనీ బ్రాండ్లపై స్పష్టమైన లేబుల్స్, లైసెన్స్ లేకుండా ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. రూ.160 లక్షల విలువైన 280 కిలోల నెయ్యి ప్యాకెట్లు, 850 కిలోల కాస్టిక్ సోడాను సీజ్ చేసి ధ్వంసం చేశారు. వాటికి సంబంధించి అన్ని శాంపుళ్లు సేకరించామని, కల్తీ జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ ఫుడ్ ఇన్స్ పెక్టర్లు పి.రోహిత్ రెడ్డి, పి.స్వాతి, జగన్నాథ్, శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు.