ప్రపంచంలోనే డేంజరస్ ఫ్లై ఓవర్లు

హైదరాబాద్ లోని గచ్చిబౌలి బయో డైవర్శిటీ జంక్షన్ దగ్గర జరిగిన యాక్సిడెంట్తో ఇప్పుడు అందరి దృష్టి ఫ్లై ఓవర్ లపై పడింది . ట్రాఫిక్ సమస్య కు చెక్ పెట్టడానికి పట్టణాలు, నగరాల్లో ఫ్లై ఓవర్ ల నిర్మాణం ఇటీవల జోరందుకుంది . అయితే ఫ్లై ఓవర్ పై ప్రయాణం చేసేటప్పుడుచాలా జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్కంట్రోల్లో ఉండాలి. ఫై ఓవర్ల పైయాక్సిడెంట్ల సంఖ్య పెరుగుతోంది. ఎక్కు వగా వెహికిల్ మలుపులదగ్గర టర్న్ చేసేటప్పడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.యాక్సిడెంట్ లు జరిగిన తీరును పరిశీలిస్తే అడ్డూ అదుపూ లేని స్పీడుతోనే టర్నింగుల దగ్గర కూడా నడపడమే కారణమని పోలీసులు అంటున్నారు. మలుపుల దగ్గర విపరీతమైన వేగంతో వెళ్లే వెహికిల్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా యాక్సిడెంట్ తప్పదు . ఇలా డేంజరస్ టర్నింగ్ పాయింట్ లు , కర్వ్లు, మలుపులు ఉన్న ఫ్లై ఓవర్లు మనదేశంలోనూ, ప్రపంచంలోనూ చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు.

1) బెంగళూరులో ఉండే యశ్వంత్ పుర ఫ్లై ఓవర్. మనదేశంలోని డేం జరస్ ఫ్లై ఓవర్ లలో ఇదొకటి. దీనిపై తరచూ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. వీటిని నివారించడానికి ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. మెటల్ రి ఫ్లెక్టర్స్ ను ఏర్పాటు చేశారు. సైన్ బోర్డులు పెట్టారు.మితిమీరిన వేగాన్ని కంట్రోల్ చేయడానికి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.

2)ఇది కోల్ కతా లోని ఉల్టా దంగా ఫ్లై ఓవర్. ఇది కూడా అనేక కర్వ్స్ తో ఉంటుంది. ఈ ఫ్లై ఓవర్ పై చాలా యాక్సిడెంట్లు జరిగాయి. అయితే కోల్ కతా ట్రాఫిక్ ను తప్పించుకోవాలంటే ఇక్కడి ప్రజలు ఈ ఫ్లై ఓవర్ ఎక్కక తప్పదు.

3)ఈ మల్టీ లేయర్ బ్రిడ్జి చైనాలోని షాంఘై సిటీకి దగ్గరలో ఉంది. ఈ ఫ్లై ఓవర్ ఆరు లెవెల్స్ లో ఉంటుంది. దీనిపై ప్రయాణం చేస్తుంటే ఎటు నుంచి వెళుతుందో తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందంటారు వెహికిల్ డ్రైవర్లు. అనేక కర్వ్స్ ఉండటం వల్ల బిక్కుబిక్కుమంటూ బండి నడుపుతుంటారు. ఇంత గజిబిజిగా ఉండి కన్ ఫ్యూజ్ చేసే ఫ్లై ఓవర్ ఇంటర్ సెక్షన్ ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదని అంటుంటారు.

4)ఈ ఫ్లై ఓవర్ ఎక్కడం అంటే కొం డెక్కినట్టే. ఏటవాలుగా ఉండే ఈ ఫ్లై ఓవర్ జపాన్ లో ఉంది. దీని పేరు ఎషిమా ఒహాషీ.దాదాపు రెండు కి లోమీటర్ల నిడివి ఉండే ఈ ఫ్లై ఓవర్ రెండు నగరాలను (మత్స్యూ–సకైమినటో) కలుపుతుంది. ఫై ఓవర్ ఎక్కితే ఏదో రోలర్ కోస్టర్ ఎక్కినట్టే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ ఎక్కే టప్పుడు ఒకే స్పీడుతో వెళ్లాల్ సి ఉంటుంది, బ్రేక్వేయకూడదు…. బండి ఆగకూడదు. అలా చేస్తే కిందకు జారిపోవడమే. పంచంలోనే డేంజరస్ ఫ్లై ఓవర్ గా చెబుతారు.