గోదావరి నదిలో మరోసారి ప్రమాదకర నురగ

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిని ఆనుకుని ప్రవహిస్తున్న గోదావరి నదిలో మరోసారి ప్రమాదకర నురగ కనిపించింది. కొన్నిరోజుల కింద ఇలాగే నదిలో నురగ ఓ పాయలా ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్న కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలతోనే ఇలా ఏర్పడిందని అంతా భావించారు. పొల్యూషన్‌‌‌‌ కంట్రోల్‌‌‌‌ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదు. తాజాగా సోమవారం మరోసారి గోదావరిలోని నీటిపై నురగ ప్రత్యక్ష్యమైంది.

సింగరేణి ప్రాంతాలకు గోదావరి నది నుంచే తాగునీరు సరఫరా జరుగుతుండడంతో జనం ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల కంపెనీలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పీసీబీ ఆఫీసర్లు, గోదావరిలోకి వ్యర్థాలు రాకుండా ఆపాలని కోరుతున్నారు.