జ్యువెల్లరీ షాపులే టార్గెట్..పటాన్‌చెరు, జగద్గిరిగట్టలో రెక్కీ
సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ లో దోపిడీలకు ప్లాన్ చేసిన ఇంటర్ స్టేట్ గ్యాంగ్ పోలీసులకు చిక్కింది. జ్యువెల్లరీ షాపులను టార్గెట్ చేసే పది మంది సభ్యుల కక్రల్ ముఠాను సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. 2 తపంచాలు, 15 బుల్లెట్లు, 4 ఐరన్ రాడ్లు, డ్రిల్లింగ్ మిషన్స్, డీసీఎం, బైక్ స్వాధీనం చేసుకున్నా రు. పటాన్‌చెరు, జగద్గిగి రిగుట్ట ఏరియాల్లో జ్యువెల్లరీ షాపుల్లో దోపిడీకి ఈ గ్యాంగ్ వేసిందని సీపీ సజ్జనార్ తెలిపారు.
ఫ్రమ్ యూపీ..
ఉత్తర్‌ప్రదేశ్ అల్హా పూర్ థాన కక్రల్ గ్రామానికి చెందిన సఖి అహ్మద్ అలియాస్ గుడ్డు(38) డ్రైవర్. లోకల్ గా దొరికే నాటు తుపాకులతో దోపిడీలకు పాల్పడేవాడు. పోలీసులకు చిక్కి జైలుకి కూడా వెళ్లొచ్చా డు. ఆ తర్వా త గోల్డ్ షాపులను లూటీ చేసేందుకు స్కెచ్ వేశాడు. అదే గ్రామానికే చెందిన హబీబుల్లా(39), హసీన్‌మహ్మద్(51), ఇఫ్రాన్ అలీఖాన్(49), రహ్మాన్ అలీ(22), ధన్‌పురాకు చెందిన బిజేందర్ సింగ్(40), రామ్‌కుమార్ సింగ్(27), మెహతబ్ బటి(45), హకీమ్ సింగ్(35), జితేందర్ సింగ్(25)తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. గోల్డ్ బిజినెస్ ఎక్కువగా జరిగే ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌లో వరుస దోపిడీలకు ఈ గ్యాంగ్ స్కెచ్ వేసింది.
జగద్గిరిగుట్టలో షెల్టర్..
జూన్ మొదటి వారంలో హైదరాబాద్ వచ్చిన ఈ టీమ్ పండ్ల వ్యాపారులమంటూ జగద్గిరిగుట్ట అంబేడ్కర్ నగర్‌లో ఓ ఇల్లు రెంట్‌కి తీసుకుంది. ఇటీవల పటాన్‌చెరులోని ఓ గోల్డ్ షాపు లూటీకి ప్లాన్ చేసింది. షాపు వెనక వైపున్న గోడకు డ్రిల్లింగ్ చేస్తుండగా, ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయనపై కత్తులు, తపంచాలతో దాడి చేశారు. ప్రభాకర్ అక్కడి నుంచి తప్పించుకోగా, పోలీసులు వస్తారనే భయంతో దోపిడీ గ్యాంగ్ పరారైంది. ఆ తర్వాత మల్లం పేట్‌లో గోల్డ్ షాపుల వద్ద రెక్కీ వేసింది. సైబరాబాద్ పోలీస్ స్ పెషల్ టీమ్ పటాన్‌చెరులోని గోల్డ్ షాపు పరిసరాల్లో, మల్లం పేట్‌లో సీసీటీవీ ఫుటేజీలు చెక్ చేసింది. యూపీ రిజిస్ట్రేషన్ తో ఉన్న డీసీఎం, ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న బైక్ ను గుర్తించింది. వాటి ఆధారంగా అంబేద్కర్ నగర్‌లో షెల్టర్ తీసుకున్న కక్రల్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసింది.