IPL 2025: ఆర్సీబీ చేసినట్టు చేస్తే మనం ప్లే ఆఫ్స్‌కు చేరొచ్చు.. సన్ రైజర్స్‌కు హెడ్ కోచ్ సలహా

IPL 2025: ఆర్సీబీ చేసినట్టు చేస్తే మనం ప్లే ఆఫ్స్‌కు చేరొచ్చు.. సన్ రైజర్స్‌కు హెడ్ కోచ్ సలహా

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ దాదాపుగా ముగిసింది. బుధవారం (ఏప్రిల్ 23) ముంబై ఇండియన్స్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా పోయినట్టే. కమ్మిన్స్ సేన ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇకపై అద్బుతంగా జరగాల్సిందే. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో రెండు మాత్రమే గెలిచిన సన్ రైజర్స్.. మిగిలిన ఆరు మ్యాచ్ ల్లో విజయం తప్పనిసరి. అంతేకాదు నెట్ రన్ రేట్ బాగా పడిపోవడంతో ఇకపై ప్రతి జట్టును భారీగా ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ లో ఇలా జరగడం దాదాపు అసాధ్యం. అయితే ప్లే ఆఫ్స్ కు వెళ్లాలంటే సన్ రైజర్స్ హెడ్ కోచ్ డానియల్ వెటోరి ఒక సలహా ఇచ్చాడు.

సన్ రైజర్స్ జట్టుతో పాటు ఫ్యాన్స్ దాదాపుగా ఆశలు వదిలేసుకున్నప్పటికీ వెటోరి మాత్రం తమ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో టాప్ 4 లో నిలిచే అవకాశం ఉందని తెలిపాడు. సన్ రైజర్స్ ఆశలు వదులుకోవాల్సి అవసరం లేదని జట్టులో ఆత్మ విశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నాడు. వెటోరి మాట్లాడుతూ.. " గత సీజన్ లో RCB అద్భుతంగా ఆడింది. ప్లే  ఆఫ్స్ నుంచి నిష్క్రమించిందనుకున్న తరుణంలో వరుసగా గెలిచి ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. ఆ జట్టు నుంచి మనం కొంత ప్రేరణ పొందితే ప్లే ఆఫ్స్ కు వెళ్లొచ్చు".  అని ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత విలేకరుల సమావేశంలో వెట్టోరి అన్నారు.

Also Read:-అర్జున్ టెండూల్కర్ మరో గేల్ అవుతాడు.. అతని దగ్గరకు ట్రైనింగ్‌కు పంపండి
    
గత సీజన్‌లో తొలి 7 మ్యాచ్ ల్లో ఒకటే మ్యాచ్ గెలిచిన ఆర్సీబీ ఆ ఆతర్వాత తమ చివరి 6 లీగ్ మ్యాచ్ ల్లో విజయం సాధించి 14 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు చేరుకున్నారు. సన్ రైజర్స్ తమ తదుపరి మ్యాచ్ శనివారం (ఏప్రిల్ 24) చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ డూ ఆర్ డై. గెలిచిన జట్టు మాత్రమే టోర్నీలో నిలుస్తుంది. ఓడిపోతే మెగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గత సీజన్ లో ఫైనల్ కు వెళ్లి రన్నరప్ గా నిలిచిన కమ్మిన్స్ సేన.. ఈ సీజన్ లో గాడిలో పడతారో లేదో చూడాలి.