IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్

IPL 2025: బోర్డర్, గవాస్కర్ కంటే కంటే SRH ముఖ్యం.. మెగా ఆక్షన్ కోసం భారత్‌కు ఆసీస్ కోచ్

నవంబర్ 22-26 తేదీలలో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది. నవంబర్ 24,25 తేదీల్లో ఐపీఎల్ మెగా ఆక్షన్ జరగనుంది. టెస్ట్ మ్యాచ్ మూడు, నాలుగు రోజులు ఐపీఎల్ మెగా ఆక్షన్ తో క్లాష్ కానుంది. అయితే మ్యాచ్ ఉదయం 7:50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మరో వైపు ఐపీఎల్ ఆక్షన్ మధ్యాహ్నం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్, డేనియల్ వెటోరి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతను ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జరగబోయే తొలి టెస్టుకు దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్ గా ఉన్న వెటోరి.. జెడ్డాలో జరిగే ఐపీఎల్ వేలం కోసం భారత్, ఆస్ట్రేలియా  మధ్య జరగబోయే తొలి టెస్టుకు దూరంగా ఉంటానని.. ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేశాడు."సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్‌గా డాన్ (డేనియల్ వెట్టోరి) పాత్రకు మేము చాలా మద్దతు ఇస్తున్నాము . ఐపీఎల్ వేలానికి హాజరయ్యే ముందు డాన్ తొలి టెస్టుకు తుది సన్నాహకాలను పూర్తి చేస్తాడు. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన మ్యాచ్ లకు జట్టుతో కలుస్తాడు".అని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

ALSO READ | AUS vs PAK: కోహ్లీని దాటేసిన బాబర్.. ప్రమాదంలో రోహిత్ రికార్డ్

వెటోరి ఇప్పటికే భారత్ కు బయలుదేరినట్టు సమాచారం. ఈ మాజీ న్యూజిలాండ్ క్రికెటర్ స్పిన్ దిగ్గజం 2022లో ఆస్ట్రేలియా సహాయక కోచింగ్ సిబ్బందిలో చేరాడు. 2023 లో సన్ రైజర్స్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. వెట్టోరి అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో క్వీన్స్‌లాండ్‌కు చెందిన లాచ్‌లాన్ స్టీవెన్స్ బాధ్యతలు స్వీకరిస్తాడు. అతను ఇటీవల ఇండియా ఏ తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు. 

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22న పెర్త్ లో జరుగుతుంది. డిసెంబర్ 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు డే నైట్ జరుగుతుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు గబ్బాలో మూడో టెస్ట్.. డిసెంబర్ 26 నుంచి 30 వరకు ఎప్పటిలాగే నాలుగో టెస్ట్ బాక్సింగ్ డే రోజున ప్రారంభమవుతుంది.మెల్బోర్న్ లో ఈ టెస్ట్ జరుగుతుంది. చివరిదైన ఐదో టెస్ట్ జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీ వేదికగా జరుగుతుంది.