
ఈడెన్ గార్డెన్స్ వేదికగా సోమవారం (ఏప్రిల్ 21) గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ టాస్ సమయంలో ఒక సరదా సీన్ చోటు చేసుకుంది. టాస్‌కు అధికారిగా వ్యవహరించిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానీ మోరిసన్ గిల్ అందానికి ఫిదా అయినట్టు తెలుస్తుంది. మోరిసన్ మాట్లాడుతూ.. " నువ్వు చాలా బాగున్నావు. పెళ్లి బాజాలు మోగుతున్నాయా? త్వరలో పెళ్లి చేసుకుంటున్నావా? అని శుభ్‌మాన్ గిల్‌ను తన పెళ్లి ప్లాన్స్ గురించి సరదాగా అడిగాడు. దానికి గిల్ అలాంటిదేం లేదని చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు.
పంజాబ్‌లో జన్మించిన గిల్.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాతో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు గతంలో చాలా వార్తలు వచ్చాయి. కానీ వీరిద్దరూ తమ రిలేషన్ పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గిల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు సారా చాలా సందర్భాల్లో మ్యాచ్ చూడడానికి వచ్చింది. గిల్ ను సపోర్ట్స్ చేస్తూ చప్పట్లు కొట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా ఉంటున్న గిల్.. జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు గుజరాత్ ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 గెలిచి టేబుల్ టాపర్ గా కొనసాగుతుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తుంది. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోని గిల్.. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 90 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. గిల్ తో పాటు సాయి సుదర్శన్, బట్లర్ రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
Only Danny Morrison can drop wedding bell questions on Shubman Gill at the toss 😅#IPL2025 #KKRvsGT #DannyMorrison #ShubmanGill #CricketTwitter pic.twitter.com/Ii7dL1FHtK
— InsideSport (@InsideSportIND) April 21, 2025