భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు హతమయ్యారు. దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. అరణ్పూర్ పోలీస్స్టేషన్పరిధిలోని నహాడీ, చోటే హిడ్మా, డూంగినీ పారా అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
బస్తర్ఫైటర్లు, డీఆర్జీ బృందాలు సంయుక్తంగా బుధవారం ఉదయాన్నే కూంబింగ్ చేపట్టారు. నహాడీ సీఆర్పీఎఫ్ క్యాంపునకు 4 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఇరు వర్గాలు ఒకరిపైఒకరు ఫైరింగ్స్టార్ట్చేయగా, ఉదయం 7.15 నుంచి దాదాపు రెండు గంటల పాటు భీకరంగా కాల్పులు కొనసాగాయి.
తర్వాత మావోయిస్టులు సమీప అడవుల్లోకి పారిపోయారు. పోలీస్బలగాల ఎన్కౌంటర్లో లక్కే, మంగ్లీ అనే ఇద్దరు మహిళా మావోయిస్టులు హతయ్యారు. ఘటనా స్థలంలో ఇద్దరి మృతదేహాలతోపాటు 12 బోర్గన్, ఇన్సాస్రైఫిల్, బుల్లెట్లు దొరికాయి. మృతదేహాలను దంతేవాడకు తరలించారు. పారిపోయిన మావోయిస్టుల కోసం అదనపు బలగాలతో గాలింపు ముమ్మరం చేశారు.