రెంట్ ఇస్తలేరని తహసీల్దార్ ఆఫీస్​కు తాళం

రెంట్ ఇస్తలేరని తహసీల్దార్ ఆఫీస్​కు తాళం

నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు: సంవత్సరం నుంచి రెంట్ ఇవ్వడం లేదంటూ ఓ వ్యక్తి తహసీల్దార్ ఆఫీస్ కు తాళం వేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లిలో శుక్రవారం జరిగింది. దంతాలపల్లి తహసీల్దార్ ఆఫీసు కోసం మండల కేంద్రానికి చెందిన వెంకన్న తన ఇంటిని రెంట్ కు ఇచ్చాడు. ఏడాది నుంచి రెంట్ ఇవ్వకపోవడం, కరెంట్ బిల్లు కూడా కట్టకపోవడంతో విసుగు చెందిన వెంకన్న శుక్రవారం ఉదయం ఆఫీసుకు తాళం వేశాడు. దీంతో ఆఫీసర్లు, వివిధ పనులపై వచ్చిన ప్రజలు చెట్ల కిందే వెయిట్ చేశారు. కొద్ది సేపటి తర్వాత ఆఫీసర్లు నచ్చచెప్పడంతో ఆఫీస్ తాళం తీశాడు.