పా పాండి, రాయన్ చిత్రాల తర్వాత ధనుష్ దర్శకుడిగా రూపొందించిన మూడో తమిళ చిత్రం ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. పవీష్, అనిఖా సురేంద్రన్ జంటగా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్, వెంకటేష్ మీనన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 21న విడుదల కానుంది. సోమవారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించాడు ధనుష్. ట్రైలర్ ప్రారంభంలోనే ధనుష్ కనిపించి ఇదొక సాధారణ ప్రేమ కథ అని చెబుతాడు. ప్రేమ, బ్రేకప్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైనింగ్‌గా సినిమా ఉండబోతోందని అర్థం అవుతోంది. మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, అక్కడ ఎదురయ్యే సంఘటనలు యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.
నటీనటుల పాత్రలను ట్రైలర్ ద్వారా పరిచయం చేసి సినిమాపై ఆసక్తిని పెంచారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు హైలైట్‌గా నిలిచింది. ధనుష్ హోమ్ బ్యానర్ వండర్ బార్ ఫిల్మ్స్, ఆర్‌కే ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి విడుదల చేస్తోంది.