అత్యాచార ఆరోపణల కేసు.. నిర్దోషిగా తేలిన శ్రీలంక క్రికెటర్

అత్యాచార ఆరోపణల కేసు.. నిర్దోషిగా తేలిన శ్రీలంక క్రికెటర్

శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకపై గతేడాది అత్యాచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2022 టీ20 వరల్డ్ కప్‌ సమయంలో ఆస్ట్రేలియా మహిళపై  గుణతిలక అత్యాచారం చేసాడనే వార్తలు రావడం.. పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. అయితే తాజాగా అతనిపై అత్యాచారయత్న ఆరోపణలను కొట్టేస్తూ ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది.

అసలు ఏం జరిగిందంటే..?

గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్ సమయంలో గుణతిలకకు ఆన్‌లైన్‌లో 29 ఏళ్ల మహిళ పరిచయమైంది. వీరిద్దరూ నవంబర్‌ 2న రోజ్‌ బే లోని ఓ హెటల్‌ గదిలో కలుసుకున్నారు. ఈ సమయంలో ఆ మహిళ తనపై అత్యచారానికి పాల్పడ్డాడని గుణతిలకపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో సిడ్నీ పోలీసులు  గుణతిలకను అరెస్ట్ చేయగా..విచారణలో మాత్రం ఈ శ్రీలంక క్రికెటర్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. విచారణ సందర్భంగా సదరు మహిళ రెండు రకాలుగా వాదనలు చెప్పడంతో న్యాయమూర్తి తీర్పును గుణతిలకకు అనుకూలంగా ఇచ్చారు.

ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది

ఇక కేసు లో నిర్దోషిగా తేలడంతో గుణతిలక సంతోషం వ్యక్తం చేసాడు. "నేను నిర్దోషిగా కోర్ట్ తీర్పునిచ్చింది. ఇప్పటి నుంచి ప్రశాంతగా నా  జీవితాన్ని గడుపుతాను. త్వరలోనే శ్రీలంక జాతీయ జట్టులో స్థానం సంపాదిస్తా".అని తెలిపాడు. కాగా శ్రీలంక జాతీయ జట్టు తరపున గుణతిలక 100 కి పైగా మ్యాచులు ఆడాడు.