నిజమైన రైతులకు అన్యాయం జరగొద్దు : డీఏవో సక్రియా నాయక్

నిజమైన రైతులకు అన్యాయం జరగొద్దు : డీఏవో సక్రియా నాయక్

గద్వాల, వెలుగు: సాగు భూముల గుర్తింపు సర్వేలో నిజమైన రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని డీఏవో సక్రియా నాయక్  సూచించారు. గద్వాల మండలంలో జరుగుతున్న సాగుకు యోగ్యం కాని భూముల సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంచర్లు, లే అవుట్లు, స్కూల్  బిల్డింగ్స్, కోళ్ల ఫారాలు, చేపల చెరువులు తదితర వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతు భరోసా పోర్టల్ లో సాగుకు యోగ్యం కాని భూములుగా నమోదు చేయాలన్నారు. సర్వేలో నిజమైన రైతులను ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగకుండా చూడాలన్నారు. ఏడీఏ సంగీతలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్  శివకుమార్, ఏఈవో ఉషశ్రీ పాల్గొన్నారు.