నష్టపోయిన రైతులు జాబితాలో పేర్లు సరిచూసుకోవాలి : సురేశ్ కుమార్ ​

నష్టపోయిన రైతులు జాబితాలో పేర్లు సరిచూసుకోవాలి :  సురేశ్ కుమార్ ​
  • డీఏవో సురేశ్ కుమార్ ​

ములుగు, వెలుగు:  ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి నష్టపోయిన రైతుల జాబితాను ఆయా జీపీ కార్యాలయాలు, తహసీల్దార్​ కార్యాలయాల్లో ప్రదర్శించామని, పేర్లను రైతులు సరిచూసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి. సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో సూచించారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర పరిశీలన చేసి నష్టపోయిన రైతుల జాబితాను రూపొందించి ఆయా కార్యాలయాల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తామన్నారు. ఈ జాబితాలో ఎవరైనా అనర్హులు  ఉన్నట్లయితే వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్  సంబంధిత విత్తన కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటారని, రైతులు సహకరించాలని కోరారు.