West Indies Cricket: వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ కోచ్‌గా డారెన్ సామీ

West Indies Cricket: వెస్టిండీస్ ఆల్ ఫార్మాట్ కోచ్‌గా డారెన్ సామీ

మాజీ క్రికెటర్, మాజీ కెప్టెన్ డారెన్ సామీ వెస్టిండీస్ పురుషుల జాతీయ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోచ్‌గా ఉన్న సామీకి.. విండీస్ బోర్డు టెస్ట్ జట్టు బాధ్యతలు అప్పగించింది. సోమవారం (డిసెంబర్ 16) అతని నియామకాన్ని ప్రకటించింది.    

ప్రస్తుతం టెస్టుల్లో జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండ్రీ కోలీ స్థానంలో సామీ ఎంపికయ్యాడు. రెండుసార్లు వెస్టిండీస్ జట్టును టీ20 ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా నిలిపిన సామీ.. ఏప్రిల్ 1, 2025 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు.

తనకు పూర్తి స్థాయి కోచ్‌గా నియమించడం పట్ల సామీ సంతోషం వ్యక్తం చేశాడు. వెస్టిండీస్‌కు ఏ హోదాలో ప్రాతినిధ్యం వహించినా అది తనకు గౌరవ సూచికంగా భావిస్తున్నట్లు తెలిపాడు. వెస్టిండీస్ క్రికెట్‪కు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని మాటిచ్చాడు.

ALSO READ | నేను గొప్ప బ్యాటర్‌ని.. నా రికార్డుల కోసం గూగుల్‌లో వెతుక్కో..: జస్ప్రీత్ బుమ్రా