హైదరాబాద్ లో కారు మబ్బులు కమ్ముకున్నాయి.. సోమవారం ( జనవరి 13, 2025 ) ఉదయం ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో తెల్లవారినా కూడా చీకటిగానే ఉంది. ఇదిలా ఉండగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రానున్న మూడురోజులు ఇదే పరిస్థితి ఉంటుందని.. ఉదయం పుట పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆదివారం హైదరాబాద్ లో కనిష్ఠంగా 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది వాతావరణ శాఖ.
తెలంగాణలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదయ్యాయని.. రానున్న మూడు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో 11 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలు, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్‌లలో ఈ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.
Also Read :- మహా కుంభ మేళా..త్రివేణి సంగమానికి పోటెత్తిన భక్తులు
హైదరాబాద్ లో చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు ఉండే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ క్రమంలో హైదరాబాద్ వాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. పొగమంచు ఉండే సమయంలో వాహనదారులు జాగ్రత్త వహించాలని సూచించింది వాతావరణ శాఖ.