బీజేపీ, బీఆర్ఎస్ కు మధ్య చీకటి ఒప్పందం : ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

బీజేపీ,బీఅర్ఎస్ కు మధ్య చీకటి ఒప్పందం నడుస్తోందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.  బీజేపీకి,బీఅర్ఎస్  బీ టీమ్ అని అన్నారు.  బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో ఆయన పర్యటించారు. బీజేపీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే రాష్ట్రంలో బీఅర్ఎస్ రాజకీయాలు చేస్తుందని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో దోచుకున్నది చాలకనే..దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు కవిత లీక్కర్ స్కామ్ పై , అదానీ ఆస్తులపై  బీఆర్ఎస్ మాట్లాడకపొవడం దారుణమన్నారు. బీసీలకు రిజర్వేషన్లను 25 శాతం నంచి  యాభై శాతం పెంచాలని   ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రజల్లో బీఎస్పీకి మంచి ఆదరణ వస్తుందన్నారు.