సన్‌‌రైజర్స్‌‌ ఆటగాళ్లు సారీ చెప్పాలి

సన్‌‌రైజర్స్‌‌ ఆటగాళ్లు సారీ చెప్పాలి

న్యూఢిల్లీ:  ‘కాలూ’ అంటూ తనని పిలిచి వివక్ష చూపెట్టిన సన్‌‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ క్రికెటర్లు వెంటనే క్షమాపణలు చెప్పాలని వెస్టిండీస్‌‌ క్రికెటర్‌‌ డారెన్‌‌ సామీ డిమాండ్‌‌ చేశాడు. 2013–14లో సన్‌‌రైజర్స్‌‌కు ఆడేటప్పుడు టీమ్‌‌లో కొందరు తనని కాలూ అని పిలిచేవారని చెప్పాడు. ఆ పదానికి అర్థం ఈ మధ్య తెలుసుకున్నానని అది ముమ్మాటికీ వివక్షనేని సామీ ఆరోపించాడు. అయితే సన్‌‌రైజర్స్‌‌ టీమ్‌‌లో పలువురు క్రికెటర్లతోపాటు బీసీసీఐ కూడా సామీ ఆరోపణలను ఖండించింది. కానీ 2014లో  ఇషాంత్‌‌ శర్మ ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో చేసిన పోస్ట్‌‌ తో సామీని కాలూ అని పిలవడం నిజమేనని తేలింది. స్టెయిన్‌‌, సామీ, భువనేశ్వర్‌‌తో కలిసున్న ఓ గ్రూప్‌‌ ఫోటోను లంబూ షేర్‌‌ చేశాడు. ‘ నేను, భువీ, కాలూ (సామీ), ఇంకా గన్‌‌ (స్టెయిన్‌‌) సన్‌‌రైజర్స్‌‌ అంటూ దానికి కాప్షన్‌‌ ఇచ్చాడు. అదే ఏడాది వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌ బర్త్‌‌ డే సందర్భంగా సామీ  ట్విటర్‌‌ ద్వారా విషెస్‌‌ చెప్పాడు. అందులో తనని తాను కాలూ అంటూ పేర్కొన్నాడు.

For More News..

గాంధీలో డాక్టర్ పై దాడి