కన్నడ ప్రముహా హీరో దర్శన్ రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉంటూ బళ్లారి జైలులో మగ్గుతున్నాడు. దీంతో అప్పటినుంచి బెయిల్ పై బయటికి రావాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కోర్టు మాత్రం బెయిల్ మంజూరు చేయడం లేదు. అయితే ఈసారి దర్శన్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్ లో పలు వింత కారణాలు చెప్పాడు.
ఇందులో రాత్రుళ్ళు సమయంలో జైలులో తనకి నిద్ర పట్టడం లేదని, అలాగే పడుకున్న సమయంలో రేణుకాస్వామి ప్రతిబింబం కలలో కనిపిస్తుందని, దీంతో తనకి ఇబ్బందిగా ఉందని కాబట్టి బెయిల్ మంజూరు చేసి బయటికి పంపించాలని బెయిల్ పిటీషన్ లో కోరాడు.
ఈ క్రమంలో అర్థ రాత్రి సమయంలో దర్శన్ బిగ్గరగా ఏడవడం, నిద్రపోకుండా మేలుకుని ఉంటూ పలు వింత శబ్దాలు చేస్తూ ఇతర ఖైదీలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు తోటి ఖైదీలు కూడా జైలు అధికారులకి ఫిర్యాదు చేశారు. దీంతో బెంగళూరు 57వ సిటీ సివిల్ కోర్టు దర్శన్ బెయిల్ పిటిషన్‌ను మరోసారి వాయిదా వేసింది.
ఈ విషయం ఇలా ఉండగా జూన్ 9న రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి కిడ్నాప్ చేసి బెంగళూరు తీసుకొచ్చి పట్టనగెరెలో షెడ్డులో బంధించి దారుణంగా దాడి చేసి హత్య చేశారు. అనంతరం ఎవ్వరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని సుమనహళ్లిలోని కాలువలో పడేశారు.
దీంతో ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ పోలీసులు దర్శన్ మరియు పవిత్ర గౌడతో సహా 17 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ 17 మందిలో ఇప్పటివరకు ముగ్గురు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలినవారు జైలు జీవితం గడుపుతున్నారు.