ప్రముఖ యువ సింగర్ దర్శన్ రావల్ (Darshan Raval) వివాహం ఘనంగా జరిగింది. తన బెస్ట్ ఫ్రెండ్,కం లవర్'ధరల్ సురీలా'(Dharal Surelia)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ శుక్రవారం (జనవరి 17న) వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
తాజాగా ఈ విషయాన్ని సింగర్ దర్శన్ రావల్ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేస్తూ వెల్లడించారు. ప్రస్తుతం తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో దర్శన్ కు సినీ సెలిబ్రేటీస్, ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెష్ తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.
దర్శన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే:
సింగర్ దర్శన్ తెలుగులో నాని నటించిన జెర్సీ మూవీలో ఓ పాట పాడి ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. జెర్సీ లో 'నీడ పదధాని' సాంగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దర్శన్ రావల్ కెరీర్ మొదట్లో అంటే 2014లో 'ఇండియాస్ రా స్టార్' మొదటి సీజన్‌లో పాల్గొని రన్నర్ గా నిలిచాడు. ఆ షోలో ఒడిశాకు చెందిన రితురాజ్ మొహంతి చేతిలో ఓడిపోయాడు. ఆ తరవాత 'ది టాలెంట్ హంట్' షోతో అతనికి మంచి గుర్తింపు దక్కింది. అప్పటి నుంచి బాలీవుడ్‌లో ప్లేబ్యాక్ సింగర్‌గా కొనసాగుతున్నాడు.
ముఖ్యంగా ప్రేమ్ రతన్ ధన్ పాయోలోని “జబ్ తుమ్ చాహో”, తేరా సురూర్‌లోని “మెయిన్ వో చాంద్”, సనమ్ తేరీ కసమ్‌లోని “ఖీచ్ మేరీ ఫోటో”, లవ్‌యాత్రిలోని “చోగడ”, మిత్రోన్ నుండి “కమరియా”, రాకీ ఔర్ రాణి కియ్ ప్రేమ్ కహానీ నుండి "ధిండోరా బజే రే" మరియు ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ నుండి "సాహిబా" మొదలైన పాటలు పాడి దర్శన్ రావల్ మంచి పేరు తెచ్చుకున్నారు.