
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ పలు జిల్లాలు ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. పోలింగ్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఓ పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిలిచిపోయింది. దర్శి నగర పంచాయతీ పరిధిలోని 132 పోలింగ్ బూతులో టీడీపీ కార్యకర్తలు ఈవీఎంను ధ్వంసం చేశారు. దర్శి 2 వ వార్డు టీడీపీ కౌన్సిలర్ వేమిరెడ్డి చెన్నారెడ్డి పోలింగ్ బూత్ లో నానా హంగామా సృష్టించి ఈవీఎంను పగులకొట్టారు.