న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్ పాదాల గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. గాయం తీవ్రత దృష్టిలో పెట్టుకొని మిచెల్ కు మరింత రెస్ట్ ఇవ్వాలని న్యూజిలాండ్ బోర్డు భావిస్తుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగబోయే టీ20 సిరీస్ కు ఈ స్టార్ ప్లేయర్ కు రెస్ట్ ఇచ్చారు.
మిచెల్ గాయం తీవ్రతపై ఎలాంటి సమాచారం లేదు. గత 6,7 నెలలుగా మిచెల్ గాయంతో బాధపడుతున్నాడు. గాయం నుండి పూర్తిగా కోలుకోవడానికి ఇదే ఉత్తమ అవకాశమని ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ వెల్లడించాడు. వైద్య సలహా తీసుకున్న తర్వాత అతనికి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నాం. ఇది కఠిన నిర్ణయం. అతను కోలుకోవడానికి దాదాపు మూడు వారాలు పట్టే అవకాశం ఉంది. అని ప్రధాన కోచ్ గ్యారీ అన్నారు. మిచెల్ స్థానంలో న్యూజిలాండ్ ఇంకా ఎవరినీ సెలక్ట్ చేయలేదు. దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు ఆడిన మిచెల్ తొలి ఇనింగ్స్ లో 34 పరుగులు చేయగా.. సెకండ్ ఇన్నింగ్స్ లో 11 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇదిలా ఉండగా.. వచ్చే నెలలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా మిచెల్ గాయం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ ను టెన్షన్ కు గురి చేస్తుంది. 2023 మినీ ఆక్షన్ లో మిచెల్ 14 కోట్ల భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఫార్మాట్ ఏదైనా మిచెల్ అదరగొడుతున్నాడు. దీంతో సూపర్ కింగ్స్ ఈ స్టార్ ఆటగాడిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువైతే మాత్రం మిచెల్ ప్రారంభ మ్యాచ్ లు దూరమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మిచెల్ గాయం న్యూజిలాండ్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఎదురు దెబ్బ తగిలింది.
A long-term foot injury forces Daryl Mitchell out of New Zealand's next four games; aims for recovery before the Australia Tests
— ESPNcricinfo (@ESPNcricinfo) February 8, 2024
? https://t.co/CKxePuoS7l pic.twitter.com/li0V1b0wSV