అక్టోబర్​ 3 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు.. ఎప్పటివరకంటే...

అక్టోబర్​ 3 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు.. ఎప్పటివరకంటే...

దసరా నవరాత్రి ఉత్సవాలకు  ఇంద్రకీలాద్రి ముస్తాబవుతుంది. తెలుగు పంచాగం ప్రకారం  ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుంచి తొమ్మిది రోజుల పాటు ( అక్టోబర్​  3 నుంచి 12 వరకు) వైభవంగా దేవి ఉత్సవాలు జరుగుతాయి.   అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమై.. అక్టోబర్‌ 12న విజయదశమి వేడుకలతో ముగుస్తాయి.  శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు  అమ్మవారు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.  హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలను శక్తి, జ్ఞానానికి సంబంధించిన దేవతగా పూజిస్తారు. 

ALSO READ | ఆధ్యాత్మికం: నవగ్రహాలను పూజిస్తే .. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసా..

విజయవాడ  దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయం లో తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ( 2024) ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి అంటే 3 అక్టోబర్ 03వ తేదీ ఉదయం 6:15 గంటల నుంచి ఉదయం 7:22 గంటలకు కలశ స్థాపనతో ప్రారంభం కానున్నాయి.  తొమ్మిది రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు 12వ తేదీ విజయ దశమితో ముగియనున్నాయి . ఇక ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో దర్శనమివ్వనున్నారు.
 

  •  మొదటి రోజు.. అక్టోబర్​ 3న బాలత్రిపుర సుందరీ అవతారం
  •  రెండవ రోజు.. అక్టోబర్ 4న గాయత్రీ దేవి
  • మూడవ రోజు.. అక్టోబర్ 5న అన్నాపూర్ణాదేవి
  •  నాలుగవరోజు.. అక్టోబర్ 6న లలితా త్రిపుర సుందరీదేవి
  • ఐదవరోజు..అక్టోబర్ 7న ..మహా చండీదేవి
  • ఆరవ  రోజు.. అక్టోబర్ 8న... మహాలక్ష్మీ దేవిగా
  • ఏడవరోజు.. అక్టోబర్ 9  మాలానక్షత్రం సందర్భంగా  చదువుల తల్లి సరస్వతీదేవిగా అమ్మవారు కటాక్షిస్తారు. 
  • ఎనిమిదో  రోజు.. అక్టోబర్ 10న.. దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవిగా, 
  • తొమ్మిదవ రోజు .. అక్టోబర్​ 11న విజయ దశమి రోజున మహిషాసుర మర్దినీగా దర్శన భాగ్యం కల్పించనున్నారు. 
  • ఇక ఆతరువాత రోజు అక్టోబర్​ 12న రాజరాజేశ్వరి దేవిగా అనుగ్రహిస్తారు. 

వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శరన్నవరాత్రులను సమయంలో భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగేలా.. ఎక్కడా ఇబ్బందులు కలుగకుండా దేవస్థానం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక నవరాత్రి వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టికెట్లతో పాటు దర్శన సమయాలతో పాటు ఇతర వివరాలన్నీ అందులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.