వంద కోట్ల క్లబ్బు వైపు దూసుకెళ్తున్న దసరా.. 5 రోజుల కలెక్షన్లు ఇలా..

దసరా సినిమాతో తెలంగాణ యాస, మేనరిజంతో సరికొత్త లుక్ లో నాని ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాతో తన కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్ ను అందుకున్నాడు. విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను అందుకుని బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు. 100 కోట్ల క్లబ్బు వైపు దూసుకెళ్తున్న ఈ సినిమా 5 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల షేర్ ను రాబట్టి ఇప్పటివరకు మొత్తం రూ. 34 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్ల గ్రాస్ ను  రాబట్టినట్టుగా నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ తాజాగా ప్రకటించింది. యూఎస్ లోనూ ఇప్పటివరకూ 1.7 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. 

సుకుమార్ శిష్యుడైన  శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. నేను లోకల్ తర్వాత  నాని, కీర్తి సురేష్  దసరాతో జోడీ కట్టారు. కీర్తి తన నటన, డ్యాన్సులతో మరోసారి విమర్శల ప్రశంసలందుకుంది. ఇక సింగరేణి నేపథ్యంలో సాగే ఈ కథలో నాని తన పాత్రకు పూర్తి న్యాయం  చేశాడు. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి వంటి సినిమాలు ఊహించిన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. దీంతో అర్జెంటుగా నానికి ఓ హిట్టు పడాల్సిన టైమ్ లో దసరా సక్సెస్ ఈ హీరో ఫ్యాన్స్ కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది.