
దసరా ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి సర్వం సిద్ధమైంది.. బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరుగుతాయని ఆలయ పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో ఇంజనీరింగ్ వర్క్స్ కు 2.5 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్లు ఈవో భ్రమరాంభ తెలిపారు. వివిధ దేవాలయాల్లో పనిచేసే 200 మందిని దసరా నవరాత్రిళ్ల సమయంలో విజయవాడ దుర్గ గుడిలో వినియోగించుకుంటామన్నారు. మరికొంత మందిని పది రోజులకు కాంటాక్ట్ పద్దతిన నియమిస్తామన్నారు. అక్టోబర్ 20 వ తేదీన ఆంధ్రప్రడేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
దసరా నవరాత్రిళ్ల సమయంలో వినాయకుడి గుడి వద్ద నుంచీ క్యూలైన్లు ప్రారంభం అవతాయని ఈవో భ్రమరాంభ తెలిపారు, ప్రతి సంవత్సరం మాదిరిగా ఐదు వరుసలు ఏర్పాటు చేయడంతో పాటు... కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారన్నారు. ...జల్లు స్నానాలకు షవర్ లు ఏర్పాటు.. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయి..
ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు. ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి.. వాటి ఫలితాలు ఏంటి..?
అక్టోబర్ 15 ( శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి ): నవరాత్రిళ్లలో తొలి రోజు (అక్టోబర్ 15) శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. అమ్మకు లేత గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. బంగారు రంగు పాజిటివ్ ఎనర్జి తీసుకువస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇక నైవేద్యంగా పులిహోరను పెట్టాలి. దీన్ని చిద్రాన్నం అని కూడా అంటారు. దీన్ని ద్వార సకల దోషాలు పోతాయని పండితులు చెబుతారు.
అక్టోబర్ 16 ( శ్రీ గాయత్రీ దేవి ) : నవరాత్రిళ్లలో రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున( అక్టోబర్ 16) అమ్మవారిని కాషాయ లేదా నారింజ రంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే ఈ రంగు ఆటంకాలను తొలగించి.. విజయాలను చేకూరుస్తుంది. కొబ్బరి అన్నాన్ని, పాయసాన్ని నైవేధ్యంగా పెడతారు. ఎందుకంటే పూర్ణఫలాన్ని పొందడానికి ఈ నైవేద్యాన్ని పెడతారన్నది పండితుల మాట.
అక్టోబర్ 17 ( శ్రీ అన్నపూర్ణా దేవి) : నవరాత్రిళ్లలో మూడవ రోజు శ్రీ అన్నపూర్ణా దేవిగా అలంకరిస్తారు. ఈ దేవికి గంధపు రంగు లేదా పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఈ రంగు ఇచ్చే గుణానికి సంకేతం. కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం చేకూరుతుంది. ఆ తల్లి అన్ని జీవరాసులకు ఆహారాన్ని ఇస్తుంది. అల్లం గారెలు, దద్దోజనం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. అమ్మను శాంతపరచడానికి గారెలను పెట్టాలన్నది భక్తుల నమ్మకం.
అక్టోబర్ 18 ( శ్రీ మహాలక్ష్మి దేవి) : నవరాత్రిళ్లలో నాలుగవ రోజు శ్రీశ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరిస్తారు. గులాబీరంగు వస్త్రంతో అలంకరించాలి. ఎందుకంటే మనస్సు ఆహ్లాదకరంగా ఉంచడానికి. కదంబం, చక్కర పొంగలితో పాటు క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే.. సకల ఆహార పదార్థాలను అమ్మవారికి పెట్టవచ్చు అన్నది భక్తుల నమ్మకం..
అక్టోబర్ 19 న (శ్రీ మహాచండీ దేవి) : నవరాత్రిళ్లలో ఐదవ రోజు శ్రీ మహాచండీ దేవిగా అలంకరిస్తారు. ఆ రోజు అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి. ఎందుకంటే ఎరుపు ఉత్తేజానికి సంకేతం అంటారు. అలాగే నైవేధ్యం కట్టు పొంగలి, చలిమిడి , వడపప్పు , పాయసం పెట్టాలి. ఎందుకంటే ఈ పదార్థంలోని మిరియాలు భూత, ప్రేత పిశాచాలను తరమడానికి నైవేద్యంగా పెడతారని పండితులు చెప్పే మాట.
అక్టోబర్20 న (శ్రీ సరస్వతీ దేవి ) : నవరాత్రిళ్లలో ఆరవ రోజు శ్రీ సరస్వతీ దేవిగా అలంకరిస్తారు. ఈ రోజు (అక్టోబర్20) మూల నక్షత్రం.. చదువుల తల్లి సరస్వతి దేవి నక్షత్రం . తెలుపు రంగు చీరలో అలంకరిస్తారు. హంస వాహనంపై కొలువై ఉంటుంది. ఈ దవళవస్త్రం మానసిక పరిపక్వతతోపాటు సకల విద్యలకు నిదర్శనం. దద్దోజనం, కేశరి నైవేద్యంగా పెట్టాలి. పిల్లలకు చదువు బాగా రావాలని ఈ నైవేద్యం పెడతారు. ఈ రోజునే (అక్టోబర్20) అమ్మవారికి సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
అక్టోబర్21 ( శ్రీ లలితా త్రిపురసుందరీ) : నవరాత్రిళ్లలో ఏడవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరీగా అలంకరిస్తారు. అమ్మవారికి అంత్యంత ప్రీతకరమైన రోజుల్లో ఒకటి..కనక దుర్గమ్మ తల్లి అక్టోబర్ 21న .. లలితా సుందరీ దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని కుంకమ, ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. దద్ధోజనం కేసరిబాత్ నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే సకల కార్యసిద్ధికి ఈ నైవేద్యాన్ని పెట్టాలి.
అక్టోబర్22 ( శ్రీ దుర్గాదేవి అలంకారం): ...నవరాత్రిళ్లలో ఎనిమిద రోజు శ్రీ దుర్గాదేవి గా అలంకరిస్తారు. నవరాత్రాళ్లలో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి.. అమ్మవారు దుర్గారవీ రూపంలో దర్శనమిస్తారు. ఆకుపచ్చ, ఎరుపు రంగు వస్త్రంతో అమ్మవారిని అలంకరించాలి. దుర్గాదేవి బుద్ధికి నిదర్శనం. అమ్మవారికి చక్కెరపొంగలి, కదంబం, శాకాన్నం నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే.. మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది.
అక్టోబర్ 23 ( శ్రీ మహిషాసురమర్ధనీ దేవి) : నవరాత్రిళ్లలో తొమ్మిదో రోజు శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా అలంకరిస్తారు. తొమ్మిదవ రోజు.. మహిషాసురమర్ధిని గా అమ్మవారు దర్శనం ఇస్తారు. ఆ రోజు దేవికి నీలం రంగు, ముదురు ఎరుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఇది యుద్ధానికి సంకేతం. ఇది ధరించి మహిషాసురుని సంహరించింది. చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు.