హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు ఆదివారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ తో పాటు అన్ని రకాల మేనేజ్ మెంట్ కాలేజీలు సెలవులను పాటించాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ శ్రీదేవసేన ఆదేశించారు. శాతవాహన వర్సిటీ మినహా మిగిలిన అన్ని యూనివర్సిటీలకు ఈ నెల 2 నుంచే దసరా హాలీడేస్ ప్రారంభయ్యాయి. ఈ నెల 13 వరకు సెలవులు కొనసాగనుండగా, 14న తిరిగి కాలేజీలు తెరుచుకో నున్నాయి. కాగా, స్కూళ్లకు ఈ నెల 2 నుంచే సెలవులు ప్రారంభమ య్యాయి. ఈ నెల 14 వరకు అవి కొనసాగనున్నాయి. ఈ నెల 15న స్కూళ్లు రీ ఓపెన్ కానున్నాయి.