నల్గొండ అర్బన్ , వెలుగు: నల్గొండ జిల్లా కొత్త కలెక్టర్‌గా దాసరి హరిచందనను నియమితులయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ కలెక్టర్‌గా పని చేసిన ఆర్‌వీ కర్ణన్‌ను కొద్ది రోజుల కింద వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేయగా.. అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా పని చేస్తున్న హరిచందన నల్గొండకు బదిలీ కావడంతో గురువారం చార్జి తీసుకునే అవకాశం ఉంది.