పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి మున్సిపాలిటీ 2024–25 మున్సిపల్ వార్షిక బడ్జెట్‌ను రూ.14.90కోట్లుగా అంచనా వేశారు. సోమవారం పెద్దపల్లి మున్సిపల్మీటింగ్హాల్లో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో చైర్‌పర్సన్ దాసరి మమతారెడ్డి బడ్జెట్ వివరాలను ప్రకటించారు. 2023–24 కు అంచనా ఆదాయం రూ.29. 26 కోట్లు కాగా వ్యయం రూ.20.98 కోట్లుగా నిర్ణయించారు. అనంతరం సవరించగా ఆదాయం రూ. 13.51 కోట్లు, వ్యయం రూ.12.84 కోట్లుగా ప్రకటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 14.90 కోట్లుగా అంచనా ఆదాయాన్ని ప్రకటించారు. అంచనా వ్యయంగా రూ. 14. 69 కోట్లు కాగా మిగులు రూ.20. 67 లక్షలుగా అంచనా వేశారు. బడ్జెట్‌ను కలెక్టర్‌తో పాటు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్‌కు పంపుతూ మున్సిపల్ కౌన్సిల్‌లో తీర్మానించారు.
పెద్దపల్లిలో ఎలాంటి సమస్యలు ఉండొద్దు
పెద్దపల్లి పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించాలని ఎమ్మెల్యే విజయరమణారావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు తాగునీరు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. అంతకుముందు మున్సిపాలిటీ కొనుగోలు చేసిన ట్రాక్టర్లను ప్రారంభించారు.