చిన్నగూడూరు నుంచి మహబూబాబాద్ వరకు బైక్ ర్యాలీ
స్థానిక ఫంక్షన్‌హాల్‌లో సమావేశం, అనంతరం కవి సమ్మేళనం
హాజరుకానున్న ప్రముఖులు
మహబూబాబాద్, వెలుగు : దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి వేడుకల నిర్వహణకు ఆయన సొంత గ్రామమైన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని దాశరథి విగ్రహం వద్ద విద్యుత్ లైట్లతో ప్రత్యేక అలంకరణ చేస్తున్నారు. ఉదయం చిన్నగూడూరులో దాశరథి విగ్రహం వద్ద నివాళి అర్పించిన అనంతరం చిన్నగూడురు నుంచి మహబూబాబాద్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ టి.రవీందర్‌రావు తెలిపారు.
మహబూబాబాద్‌లోని ఎస్‌ఎస్‌వీఎం ఫంక్షన్ హాల్‌లో జరిగే జయంతి వేడుకలకు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మురళీ నాయక్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కవి నందిని సిధారెడ్డి, ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ హాజరుకానున్నారు. సమావేశం అనంతరం కవి సమ్మేళనం జరగనున్న నిర్వాహకులు తెలిపారు. కాగా చిన్నగూడురు మండలానికి దాశరథి పేరు పెట్టాలని, జిల్లా కేంద్రంలో ఆయన పేరిట ఆడిటోరియం నిర్మించాలని, దాశరథి శతజయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంవత్సరం పాటు నిర్వహించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.