TRS అభ్యర్థులు వ్యాపారులు, పైరవీకారులు : దాసోజు శ్రవణ్

హైదరాబాద్: విజ్ఞతతో ఆలోచించి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాల్సిన అవసరం వచ్చిందన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. జనం వేసే ఓటు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే ఆయుధం అన్నారు. “‘TRS నియంతృత్వాన్ని గమనించండి. TRS, BJPలో దేనికి ఓటేసినా అది చేరేది BJPకే. ఇది ముస్లిం మైనారిటీ లు గుర్తించాలి. ధనం బలం ఉందనే TRS వ్యాపారస్తులను పోటీలో పెట్టింది. నల్గొండ TRS అభ్యర్థి ఒక భూ కబ్జాకోరు. ఖమ్మం TRS అభ్యర్థి బ్యాంకులను ముంచిన వ్యక్తి. మల్కాజిగిరి TRS అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఓ ఫీజుల దొంగ. తలసాని కొడుకు భూ కబ్జాకోరు, సెటిల్ మెంట్ మేనేజర్. వ్యాపారమే లక్ష్యంగా పార్లమెంట్ లో పైరవీలు చేసే TRS అభ్యర్థులు కావాలో… ప్రజా సేవ చేసే కాంగ్రెస్ అభ్యర్థులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి” అని దాసోజ్ శ్రవణ్ అన్నారు.