కేసీఆర్ నాకు రాజకీయ పునర్జన్మనిచ్చారు -:దాసోజు శ్రవణ్

కేసీఆర్ నాకు రాజకీయ పునర్జన్మనిచ్చారు -:దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మాజీ సీఎం కేసీఆర్ తనకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఎమ్మెల్సీగా తనకు దక్కిన ఈ అవకాశాన్ని కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యేందుకు వినియోగిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శ్రవణ్ ప్రెస్​మీట్ నిర్వహించారు.

 18 ఏండ్లు రాజకీయ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీ పదవి రాజకీయ పునర్జన్మ లాంటిదని అన్నారు. తన చివరి శ్వాస వరకు తెలంగాణ ప్రయోజనాల కోసమే పని చేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్​ రావు, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలియజేశారు.