ఉపాధ్యాయ, పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ను మ్యానేజ్ చేయడం వల్లే టీఆర్ఎస్ గెలిచిందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు.
దాసోజు శ్రావణ్
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడం ఆ పార్టీకి చెంపపెట్టని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ అన్నారు. ‘ప్రజాస్వామిక తెలంగాణకు ఈ గెలుపు నాంది అని.. తెలంగాణ మేధావులు ఉద్యోగస్తులు ప్రజల పక్షాన ఉన్నారు. బ్యాలెట్ పేపర్ లతో ఎన్నికలు పెట్టడం వలన mlc ఎన్నికల్లో గెలిచాం. ఈవీఎంలను మ్యానేజ్ చేసి ముందస్తు ఎన్నికల్లో trs గెలిచింది. పోస్టల్ బ్యాలెట్ లు ఎవరికి ఎక్కువ వస్తే వారే ఎక్కువ సీట్లు గెలుస్తారు. కానీ ముందస్తు ఎన్నికల్లో మాకు 73 ప్రాంతాల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువ గా వచ్చాయి. trs కు 28 స్థానాల్లో పోస్టల్ ఎక్కువ వచ్చాయి.. కానీ trs కు 88 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 19 వచ్చాయి. చెన్నూర్ చెల్లని పైసా పెద్దపల్లి లో చెల్లుతుందా?. ఖమ్మం అసెంబ్లీలో చెల్లని రూపాయి ఖమ్మం పార్లమెంట్ లో చెల్లుతుందా?. తప్పు చేస్తారని ఊహించి ఏపీ లో ias, ips లను తీసివేస్తూన్నారు…ఇక్కడ 20 లక్షల ఓట్ లు తీసివేశారని రజత్ కుమార్ మీద పిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు‘ అని ప్రశ్నించారు
మల్ రెడ్డి రంగారెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల అప్పటి నుండి ట్యాoపరింగ్ చేస్తూ గెలుస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. ‘అభివృద్ధి చెందిన దేశాలలో కూడా బ్యాలట్ ద్వారా ఎన్నికలు పెడుతున్నారు. trs గెలిచింది 45 సీట్లు మాత్రమే.evm మిషన్ లతోనే మిగతా 40 సీట్లు వచ్చాయి. అభ్యర్థులు కోరితే vv ప్యాట్ లను లెక్కించాలి. నిన్న జరిగిన ఎన్నికలు అసలైన సర్వే ఫలితాలు‘ అని అన్నారు.
గూడురు నారాయణ రెడ్డి
ఈవీఎంల ద్వారా నే ముందస్తు ఎన్నికల్లో trs పార్టీ గెలిచిందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి అన్నారు. ‘ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోచేర్చుకున్నారు. ఇంకా ఎమ్మెల్యేలు వస్తున్నారని అంటున్నారు.ఇది సిగ్గుచేటు. పార్టీ మారిన mla లను కోరుతున్న మళ్ళీ కాంగ్రేస్ లోకి రండి‘ అని అన్నారు.