- బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సురేశ్
ముషీరాబాద్, వెలుగు: ఈడబ్ల్యూఎస్ రిజర్వే షన్ల కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు నష్టపోతున్నారని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ అన్నారు. తెలంగాణలో ఆ రిజర్వేషన్లను అమలు చేయకూడదని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై త్వరలోనే హైకోర్టులో రిట్ వేస్తామని పేర్కొన్నారు. ఆదివారం హైద రాబాద్ బాగ్ లింగంపల్లిలో సమితి కేంద్ర కార్యాలయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అంశంపై రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించారు.
సురేశ్ మాట్లాడుతూ వెనుకబడిన వర్గా లకు రిజర్వేషన్లతోనే అవకాశాలు దక్కుతున్నాయన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం వల్ల వెనుకబడిన వర్గాల వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని, కానీ.. రాజ్యాంగ సవరణ చేసి మరీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, భాగయ్య పాల్గొన్నారు.