42శాతం బీసీ రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు: దాసు సురేష్

42శాతం బీసీ రిజర్వేషన్లను రాజకీయం చేయొద్దు: దాసు సురేష్
  • బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ 

బషీర్​బాగ్, వెలుగు: 42శాతం బీసీ రిజర్వేషన్లపై రాజకీయం చేయొద్దని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఢిల్లీలో బీసీల సభ పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా విద్య, ఉద్యోగ, రాజకీయాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, పార్టీపరమైన అవకాశాలల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని దాసు ఆయన చేశారు. 

శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి ఆధ్వర్యంలో బీసీ మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారుల సమావేశం జరిగింది.  దాసు సురేశ్ పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకుండా... ఢిల్లీలో ధర్నాలను నిర్వహిస్తుండటం ప్రభుత్వ నిబద్ధతను శంఖించేలా ఉందని విమర్శించారు.

 డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే 42 శాతం రిజర్వేషన్లను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. 42 % బీసీ రిజర్వేషన్ల ప్రచారంతోనే కాలాన్ని గడుపుతున్నదని విమర్శించారు.